ప్రియమయిన రవి మరియూ వసుధ లకు
మా కన్నడ దేశ యాత్ర విశేషాల గురించి మీ నాన్నగారు ప్రేమతో తెలుపు వివరములు. మీ అమ్మ నేను డిసెంబరు 4 2015 సాయంత్రము ఎయిరు కోస్తా విమానము లో బయలుదేరి బెంగళూరు కేంద్రము గా డిసెంబరు 14 2015 వరకు కర్ణాటక దేశము లో వివిధ ప్రదేశములు సందర్శించి డిసెంబరు 15 2015 ఉదయము మన ఇంటికి చేరుకున్నాము.
కర్ణాటక పర్యాటక శాఖ రాజ ముద్ర లో "ఒక రాష్ట్రము అనేక ప్రపంచాలు" అని రాసి ఉంటుంది. మనము చూసి తరించితేనే దాని అర్ధం తెలుస్తుంది. ఆహ్లాదకరమయిన వాతావరణము, మృదుస్వభావము గల ప్రజలు, రుచికరమయిన ఆహారశాలలు, వైవిధ్యమయిన యాత్రాస్థలములతో నిత్యము కళకళ లాడే ప్రదెశము కర్ణాటక రాజ్యం. హిందువులు, సిక్కులు, ముస్లిములు, జైనులు, బౌద్దులు, క్రిస్టియనులు సర్వమతముల ప్రజలు మరియు తెలుగు తమిళ పంజాబీ బీహారీ గుజరాతీ అస్సామీ మణిపురీ యే కాకుండ ప్రపంచములో అన్ని భాషల ప్రజలు వారి వారి ఆహారశాలలతో సర్వశోభాయమానము గా ఉండే ప్రదెశము కర్ణాటక రాజ్యం. దట్టమయిన అరణ్యములు, ఎత్తైన పశ్చిమ పర్వత శ్రేణులు, గలగల పారే సెలయేరులు, నదులు, సస్యస్యామలమయిన పచ్చటి పంటలతో కళకళ లాడే ప్రదెశము కర్ణాటక రాజ్యం. శాతవాహనులు, శ్రీ కృస్ణ దేవరాయలు, బాదామి చాళుక్యులు, హోయసాలలు, మైసూరు మహారాజులు అద్భుతమయిన దేవాలయములు, భవనములు కోటలు నిర్మించి ప్రజలను జనరంజకం గా పరిపాలించారు. వారి వారసత్వసంపదను నేటి ప్రజలు కూడా మెరుగులు పెట్టి సమ్రక్షించుకుంటున్నారు
మొదటి యాత్రా ప్రదేశాలు
1959 లో చైనా ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి శాంతి కాముక దేశం అయిన టిబెట్టు ను ఆక్రమించుకుంది. దలైలామా సారధ్యములొ టిబెటన్ బౌద్ద బిక్షువల బృందం భారతదెశాన్ని ఆశ్రయం కోరింది. నెహ్రూ గారు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల కెంద్రముగా దెశములో వివిధ ప్రదెశాలలో టిబెట్టనులకు బౌద్ద ఆశ్రమమాలు నిర్మిచుకుందుకు అనుమతి ఇచ్చింది. వారు ఇక్కడి ప్రత్యేకమయిన వ్యవసాయ క్షెత్రాలు బౌద్ద విశ్వవిద్యాలయములలో ప్రశాంత జీవితమును గడుపుతూఉంటారు. సువిశాలమయిన ఆవరణము, కనులకు ఇంపయిన రంగులతో భవన నిర్మాణములు, నడకదారికి ఇరువైపులా అందమయిన పూలచెట్లు, పరిశుభ్రతకు ఆనవాలముగా ఉన్న ఆ మందిరాన్ని యెంతసేపుచూసినా చూడాలనేఅనిపిస్తుంది. వారి నిర్మాణ నైపుణ్యాన్ని పరిసరాల పరిశుభ్రతను ఎంతైనా అభినందించాలి. మేము పద్మ శాంభవ బౌద్ద విహార అనే భవనం వద్దకు చేరుకున్నాము. ఒక్కసారి దేవాలయములోనికి ప్రవేసించగానే బంగారం పూతతో ఉన్న మూడు బుద్ద విగ్రహాలు ఒక్కసారిగా చూసేసరికి కళ్ళు మిరుమిట్లు కమ్ముతాయి. భగవాన్ బుద్దుడి మూడు అవతారాలు పద్మశాంభవ, బుద్ద, అమితాయు ల 40 అడుగుల బంగారు విగ్రహాలు గోడల మీద స్వాభావకమయిన రంగులతో చిత్రీకరించిన టిబెటన్ల దేవతలు, అవతారాలు, బౌద్దుల దేవదానవ సమరాలు చిత్రాలు మనలని ఏదో దైవ లోకాలకు తీసుకుని వెళతాయి.
![]() |
![]() |
![]() |





చాల బగుంది .. టిబెటెనుల బౌద్ద ఆశ్రమం లొ అమ్మ హాయిగా నించుంది :)
ReplyDeleteఉయ్యాల కూడా బావుంది హాయిగా...